Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్‌లోనే పుట్టాను... కాంగ్రెస్ పార్టీలోనే చస్తాను: సినీ నిర్మాత బండ్ల గణేశ్

Bandla Ganesh says he will die in congress
Advertisement
  • పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు
  • తెల్లారి లేస్తే రాముడిని, వెంకటేశ్వరస్వామిని తలుచుకునే తామే అసలైన హిందువులమన్న బండ్ల గణేశ్
  • కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి గర్వపడతానని వ్యాఖ్య
Advertisement
తాను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టానని... కాంగ్రెస్ పార్టీలోనే చస్తానని ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ అన్నారు. గురువారం మంథనిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో పద్నాలుగు లోక్ సభ స్థానాలు పక్కాగా గెలవాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. తాను మంథనికి వచ్చిప్పుడు కొందరిని ఎవరికి ఓటు వేస్తావని అడిగితే... సర్ మేం హిందువులం... బీజేపీకి ఓటేస్తామని చెప్పారని పేర్కొన్నారు. దీంతో అసలైన హిందుత్వ పార్టీ కాంగ్రెస్ అని వారికి చెప్పానన్నారు.

'బాబూ, నాకు 50 సంవత్సరాలు. 34 ఏళ్లు శబరిమలై వెళ్లి వచ్చాను. నువ్వు నాకంటే గొప్ప హిందువు కాదు. మీరు శ్రీరామ్ శ్రీరామ్ అంటూ పేరెత్తుతున్నారు. కానీ నేను బతికేదే శ్రీరాముడిని నమ్ముకొని... మేం నమ్ముకునేదే ఆంజనేయుడిని. మేం ఉదయం నిద్రలేస్తే అంజనేయుడిని, వెంకటేశ్వరస్వామిని, అయ్యప్పను తలుచుకుంటాం. ముస్లిం, క్రైస్తవులను గౌరవిస్తాం.. మా కంటే హిందువులు ఎవరూ లేరు. మీరు హిందువు పేరు చెప్పుకుంటున్నారు.. మా అణువణువునా హిందుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీయే హిందూ పార్టీ' అని వారికి సమాధానం ఇచ్చానన్నారు.

కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో అందరికీ తెలుసునన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్, అంబేడ్కర్ ఆశయాలను నిలబెడుతున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. అందరినీ అక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమే ధర్మమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడం గర్వకారణమన్నారు.
Advertisement
Advertisement
Bandla Ganesh
Congress
Lok Sabha Polls
BJP

More Telugu News